ఆర్డివో గా చైత్ర వర్షిణి బాధ్యతలు స్వీకరణ

ఆర్డివో గా చైత్ర వర్షిణి బాధ్యతలు స్వీకరణ

1
TMedia (Telugu News) :

ఆర్డివో గా చైత్ర వర్షిణి బాధ్యతలు స్వీకరణ
టి మీడియా, ఎప్రిల్ 12,రాజమహంద్రవరం:
రాజమండ్రి డివిజన్ పరిధిలో స్పందన ఫిర్యాదు లను నీర్ణత కాల వ్యవధి లో పరిష్కారం చూపి, ప్రభుత్వ ప్రాధాన్యత పధకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం లో మెరుగైన పనితీరు కనపరచడం జరుగుతుందని రాజమండ్రి డివిజన్ రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్ర వర్షిణి పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆర్డివో గా బాధ్యత లు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆర్డివో చైత్ర వర్షిణి మాట్లాడుతూ, 2018 లో గ్రూప్ వన్ అధికారిగా ఎంపికై తొలి పోస్టింగ్ విజయవాడ లో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా చేరడం జరిగిందన్నారు.

Also Read : అణగారిన వర్గాలకు తొలి గొంతుక జ్యోతిరావు పూలే

అనంతరం నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ లో ఆర్డివో గా భాద్యతలు చేపట్టానని, 2వ సారి ఆర్డివో గా రాజమండ్రి కి బదిలీ పై రావడం జరిగిందన్నారు. పెండింగ్ అంశాలను పరిష్కారం చూపి, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలులో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాజమండ్రి డివిజన్ కి మంచి పేరు ఉందని, ఆ పేరు ని నిలబట్టెందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నూతనంగా విధులకు రిపోర్ట్ చేసిన ఆర్డివో కి పరిపాలన అధికారిణి జి ఎల్ ఎస్ దేవి, డివిజనల్ పీఆర్వో ఎమ్ ఎల్. ఆచార్యులు, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube