ఘనంగా “చాకలి ఐలమ్మ” జన్మదిన వేడుకలు

ఘనంగా "చాకలి ఐలమ్మ" జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా “చాకలి ఐలమ్మ” జన్మదిన వేడుకలు

టీ మీడియా, సెప్టెంబర్ 25,ఖమ్మం:టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య హాజరయ్యారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Also Read : భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న పోలీసులు

ఈ సందర్భంగా యువతను విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో “చాకలి ఐలమ్మ” చూపిన పోరాటపటిమ నేటి ప్రపంచానికి అవసరమని ఆయన అన్నారు. ఆమె ప్రదర్శించిన స్ఫూర్తిదాయకమైన పోరాటాలు ఎంతో మందిని ఉద్యమంలోకి నడిపించాయని, నాటి ఆమె తెగువ ఫలితంగానే సాయుధ పోరాటము ఉదృతంగా జరిగిందని చెప్పవచ్చని,చాకలి ఐలమ్మ లాంటి దీరవనిత ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉందని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు పాషా తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube