చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

1
TMedia (Telugu News) :

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
టీ మీడియా; ఏప్రిల్ 1; జగిత్యాల:యావత్‌ మహిళా లోకానికి ఐలమ్మ జీవితం స్ఫూర్తి దాయకమని, ఆమె తెగువ మహిళా చైతన్యానికి ప్రతీక – మంత్రి కొప్పుల అ న్నారు.జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని మంత్రి కొప్పుల అన్నారు. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మను మహిళ ఉక్కు మహిళ అంటూ, తెలంగాణ మట్టిలోనే పోరాటముందని, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప నిదర్శనం అని మంత్రి కొప్పుల కొనియాడారు ఈ కార్యక్రమంలో తెరాసరాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాస్ రావు, యంపిపి కూనమల్ల లక్ష్మీ, జడ్పీటీసి సుధారాణి, స్థానిక సర్పంచ్, యంపిటిసి లు, మరియు తెరాస నాయకులు, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : ఎంజీఎం దవాఖానను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube