డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

0
TMedia (Telugu News) :

డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

– చాణక్యుడు

లహరి, అక్టోబర్ 7, కల్చరల్ : జీవితంలో పురోగతి లేదా అభివృద్ధి సాధించడం అందరకీ సాధ్యమయ్యే విషయం కాదు. కొందరు ఎంత కష్టపడినా , ఎంత సంపాదించినా అవసరానికి చతిలో రూపాయి కూడా మిగుల్చుకోలేరు. కొందరు సంపాదించింది తక్కువే అయినా ఎప్పుడూ వాళ్ల జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవే ఎదురుకావు. దీనికి కారణం ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్. అంటే ఎంత సంపాదించాం అనే కన్నా ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఎంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేశాం అన్నదే ముఖ్యం. డబ్బు సంపాదించడం, ఆదాయ చేయడం ఓ కళ అయితే…అవసరమైన మేరకు ఖర్చు చేయడం మరో కళ. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వ్యక్తి విజయం లేదా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్పాడు.

1. డబ్బు ఆదా ఓ కళ :
డబ్బు పొదుపు చేసే కళ ఉన్న వ్యక్తికి ఎప్పటికీ ఆర్థిక‌ సమస్యలు ఎదురుకావు. ఆర్థిక‌ సమస్యలను ఎదురైనా, వాటి నుంచి ఎలా బయటపడాలో బాగా తెలుసు. అలాంటి వారు తక్కువ సమయంలో త్వరగా ధనవంతులవుతారు. అలాంటి వ్యక్తులు తమ జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.

Also Read : వెల్లుల్లి పొట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.?

2. డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఇది గుర్తుంచుకోండి :
మన దగ్గర కొంచెం డబ్బు ఉన్నా, ఎక్కువ డబ్బు ఉన్నా, ఖర్చు చేసేటప్పుడు అవ‌గాహ‌న‌తో ఉండాలి. ఖర్చు చేయడం లేదా దానితో మన కోరికలు తీర్చుకోవడం గురించి మనం స్పృహతో ఉండాలి. ఏ సమయంలో, ఎక్కడ ఎంత డబ్బు ఖర్చు చేయాలో తెలుసుకోండి. ఆలోచించకుండా దేనికీ డబ్బు ఖర్చు చేయకండి.

3. కార‌ణం లేకుండా డబ్బు ఖర్చు చేయవద్దు :
మీరు ఎటువంటి కారణం లేకుండా లేదా ఎటువంటి అవసరం లేకుండా డబ్బు ఖర్చు చేస్తే ఏదో ఒక రోజు చాలా పెద్ద ఇబ్బందుల్లో పడతారు. మీరు భవిష్యత్తులో డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటే, ఇప్పటి నుండి మీ ఖర్చులను నియంత్రించండి.

4. పెట్టుబడి పెట్టండి :
మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు సానుకూలంగా ఆలోచించండి. ఏదైనా మంచి ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టండి. ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో మీరు పొదుపు చేసిన డబ్బు ఏదో ఒక రోజు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తుంది. అయితే, పెట్టుబడి పెట్టేటప్పుడు సురక్షితమైన స్థలం కోసం చూసుకుని ఆలోచించి పెట్టుబడి పెట్టండి. డబ్బు పెట్టుబడి మీకు భద్రతను ఇస్తుంది.

ఆచార్య చాణక్యుడి ఈ సూచ‌న‌లను తన జీవితంలో స్వీకరించి, అదే విధంగా జీవితాన్ని నడిపించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ అపజయం అన్న‌దే ఎరుగ‌డు. అతను తన అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube