పేరుమార్పు ఆలోచనపై చంద్రబాబు ఆగ్రహం

పేరుమార్పు ఆలోచనపై చంద్రబాబు ఆగ్రహం

1
TMedia (Telugu News) :

పేరుమార్పు ఆలోచనపై చంద్రబాబు ఆగ్రహం

టీ మీడియా,సెప్టెంబర్ 21, నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్‌ ఆరోగ్యవర్సిటీ పేరుమార్పు చేసే ఆలోచన పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌ తీవ్రంగా స్పందించారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఎం సంబంధమని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ నిర్మించిన వర్సిటీకి వైఎస్సార్‌ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారని నిలదీశారు. ఆరోగ్యవర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

 

Also Read : వైభవంగా లక్ష పుష్పార్చన పూజలు

ఉన్న సంస్థలకు పేరు మార్పు సరైనది కాదని ఏదైనా కొత్తగా నిర్మిస్తే పేరొస్తుందని సూచించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణ యం వెనక్కి తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం తుగ్లక్‌ చర్యలను అవలంభిస్తుందని ఆరోపిం చారు. ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవమని పేర్నొ్న్నారు. ఎన్టీఆర్‌ మహానుభావుడి పేరు తొలగించాలని ఎలా అనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా, ఇలానే చూస్తూపోతే ఆంధ్రప్రదేశ్‌ను జగనాంధ్రప్రదేశ్‌ అని కూడా మారుస్తారని ఎద్దేవా చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube