టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట..
టీ మీడియా, అక్టోబర్ 11, అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ బాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఈ కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది.
Also Read : శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం..
ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube