చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

0
TMedia (Telugu News) :

చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

టీ మీడియా, డిసెంబర్ 12, అమరావతి : ఫైబర్‌ నెట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ జనవరి 17కు వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నాం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలోకి రాగా న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేల ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు పలు ఇరువర్గాలకు పలు సూచనలు చేసింది. ఫైబర్‌ కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వానికి సూచింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 17- ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఆ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న నిబంధన కొనసాగుతుందని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది.

Also Read : గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌కి జైలు శిక్ష, జరిమానా విధింపు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube