సీఎం ప‌ద‌వుల కోసం పార్టీలు మారిండు

- రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు ధ్వ‌జం

0
TMedia (Telugu News) :

సీఎం ప‌ద‌వుల కోసం పార్టీలు మారిండు
– రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు ధ్వ‌జం

టీ మీడియా, డిసెంబర్ 21, హైద‌రాబాద్ : ప‌ద‌వుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు త‌ప్ప‌.. మేం అలాంటి ప‌ని చేయ‌లేద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో త‌ప్పేముంద‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ రంగ ప‌రిస్థితిపై స్వ‌ల్పకాలిక చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సిద్దిపేట‌, గ‌జ్వేల్, ఓల్డ్ సిటీ ప్ర‌జ‌లు క‌రెంట్ బిల్లులు క‌ట్ట‌లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై హ‌రీశ్‌రావు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్య‌ల‌పై క్లారిఫికేష‌న్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తాను. దండం పెడుతా మైక్ క‌ట్ చేయకండి. సిద్దిపేట‌, గ‌జ్వేల్, ఓల్ట్ సిటీ ప్ర‌జ‌ల మీద సీఎం అక్క‌సు వెళ్ల‌గ‌క్కే ప్ర‌య‌త్నం చేశారు.

Also Read : పార్టీ మారానంటూ మాట్లాడితే తాటతీస్తా

సిద్దిపేట‌లో, గ‌జ్వేల్, ఓల్ట్ సిటీలో కాంగ్రెస్ గెల‌వ‌లేద‌నే బాధ‌లో రేవంత్ ఉన్నారు. దాంతో బిల్లులు అక్క‌డ ప్ర‌జ‌లు క‌ట్ట‌లేద‌న్నారు. ఇది వాస్త‌వం కాదు. అక్క‌డ ఏదాన్న ఒక్క లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుదో, ఒక ఇండ‌స్ట్రీయ‌లిస్ట్ ఎవ‌ర‌న్న క‌ట్ట‌క‌పోతే, ఆ బిల్లులు వ‌సూలు చేయండి త‌ప్ప‌.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను బ‌ద్నాం చేయ‌డం స‌బ‌బు కాదు అని సీఎం రేవంత్‌కు హ‌రీశ్‌రావు సూచించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube