టి మీడియా, నవంబర్ 10, చర్ల :
చర్ల మండలం కేంద్రంలో గల మార్కెట్ యార్డు ఆవర్ణలో టీ డీ పి పార్టీ మండల కమిటీ సమావేశం బుధవారం శ్రీ యడారి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కొమరం దామోదర రావు పార్లమెంట్ ఎస్ టి సెల్ ఉపాద్యక్షులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆటలు ఆడుతున్నాయని, రబీలో వరివేయరాదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా పంటవేసినయెడల ప్రభుత్వం
కొనుగోలుచేయదని, రైతులు ఆరుదడి పంటలు వేసుకోవాలని, చెబుతోంది. కానీ ఆరుదలపంటలు ఏవి వేయాలి, వాటి మద్దతు ధర సంగతి ఏమిటీ? చీడపీడలు వస్తే ఎలా! దీనిపై సమగ్ర సమాచారం ఏమిచెప్పకుండా, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ఖరీఫ్ లోని ప్రతీ రైతు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,
రైతు సమన్వయ కమిటీలు పూర్తి భాద్యతలు తీసుకోవాలని, టీ ఆర్ ఎస్ సభ్యులతో, క్యాడరతో నిండిపోయిందని, గతసీజన్ లో వరి సన్నరకాలు మాత్రమే వేయాలని, దొడ్డు రకాలు వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను తికమక పెడుతున్నారని, రైతు సంఘాలు, ప్రతిపక్షపార్టీల ఆందోళన వలన దొడ్డు గింజలు కొనుగోలు చేస్తామంటున్నారు. రెండు ప్రభుత్వాలు “వరి ధాన్యాన్ని”రానున్న కాలంలో కనపడకుండా చేయాలనే కుట్రతో ఉన్నాయని, చాపక్రింద నీరులా కార్పోరేట్ కంపెనీలతో వ్యవసాయ రంగాన్ని ధారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, ఈ చర్యలు మానుకోకపోతే రైతు ఉద్యమాలు తీవ్రంగా ప్రతిఘటిస్తాయని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శ్రీ యుండాలి సత్యనారాయణ, రేగళ్ళ సుధాకర్, మండల కార్యదర్శి ఎన్. మోహన్ కృష్ణ, ఎడ్ల సత్తిబాబు, నాగయ్య, చినబాబు తదితరులు పాల్గొన్నారు.