చ ట్టం నర్సరీ వారికి చుట్టం

చ ట్టం నర్సరీ వారికి చుట్టం

0
TMedia (Telugu News) :

చ ట్టం నర్సరీ వారికి చుట్టం

– ఉమ్మడి జిల్లాలో ఒక్కరికే లైసెన్స్

– అనధి కారిక వాటితో భారీ టోకరా

– అక్రమార్కు ల్లో ప్రజాప్రతినిధులు

– కోట్ల రూపాయల టర్నోవర్

 

 

టీ మీడియా ,ఆగస్టు 8,నిఘావిబాగం:చట్టం అధికారం లో ఉన్న కొంత మందికి చుట్టం అనేది నర్సరీ లు నిర్వహణలో మరోసారి బైట పడింది. 2017 జనవరి 28 న అప్పటికే రూపొందించిన చట్టం ప్రకారం నర్సరీ నిర్వహణ కు లైసెన్స్ తప్పని సరి చేస్తూ ప్రభుత్వం జి ఓ నెంబర్08 నీ జారీ చేసింది.అమలు చేయాల్సిన అధికారులు అడ్డ తోవ మూలంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తూ జనానినికి,ప్రభుత్వానికి టోకరా వేస్తున్న వారి లో అధికారపార్టీ ప్రజా ప్రతి నిధులు ఉన్నరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో లైసెన్స్ పొందిన నర్సరీ ఓకే ఒక్కటి ఉంది.అయినా వందల సంఖ్య లో నర్సరీలు నడుపుతూ కోట్ల రూపాయలు దండు కొంటున్నారు. కొంత మంది ఓక అడుగు ముందుకు వేసి నార్లు కొన్న వారికి సమందిత విత్తన కంపెనీ బిల్లు కూడా ఇస్తానని బహిరంగ ప్రకటన ఇచ్చిన పట్టించు కొనే వారు కరువయ్యారు. రైతు ప్రభుత్వం లో రైతులు కు బహిరంగ టోకరా వేదిక ఖమ్మం జిల్లా కావడం పై చర్చ సాగుతోంది .టి మీడియా బృందం పరిశీలన వివరాలు..

చట్ట ప్రకారం

2017     లో తేతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నర్సరీల నియంత్రణ చట్టం ముఖ్యంగా రైతులు ను దృష్టి లో పెట్టు కొని తెచ్చింది.కేవలం 5వెలు రూపాయలు ఫీజ్ గా చెల్లించి లైసెన్స్ పొందే అవ కాశం కల్పించింది.అదే సందర్భం లో అనుమతి లేని నర్సరీ నిర్వాహకులు పై చర్యలు కు ఆదేశించింది.ఉద్యాన వన శాఖ ది ప్రధాన బాధ్యత అయిన,వ్యవసాయ శాఖ జోక్యం కు అవకాశం కల్పించింది.పోలీస్,రెవిన్యూ శాఖ కూడా పరిశీలన చెయ్య వచ్చు. రాష్ట్రం లో అత్యధికంగా ఉద్యాన వనం ఉన్నది.మొక్కల ఎగుమతులు కలిగింది తెలంగాణ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా.ఇక్కడే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చట్ట ఉల్లంఘన సాగుతోంది.అందుకు కారణం రాజకీయ జోక్యం తో పాటు.ఎక్కడ నుండో కొనుక్కొచ్చం మొక్కలు అని రికార్డులో చూపి,అనుమతి లేని స్థానిక నర్సరీ ల లో మొక్క లు కొని హరిత హారం పేరుతో బిల్లు లు భారీ గా బిల్లులు స్వాహా చేస్తున్నట్లు గా తెలుస్తోంది.ముఖ్యంగా ఈ కుంభ కోణం లో ఖమ్మం తో పాటు ఉమ్మడి జిల్లాల్లోని పలు మున్సిపాల్టీ లు, మేజర్ పంచాయతీ లు ఉన్నట్లు వెల్లడి అయింది. పండ్ల మొక్కలు లాంటి ప్రభుత్వ నిధులు తో కొను గోలు గురించి చెప్పనవసరం లేదు. మిరప, వరి ,పొగాకు,టమాట లాంటి వి నకిలీ విత్తనాలు తో అనుమతి లేని నర్సరీలు నార్లు అమ్ముతున్న వి కో కొల్లలు గా ఉన్నాయి.

 

 అనుమతి కావాలి అంటే:

   5వెలు వరకు డిపాజిట్, యాజి మాని అడ్రస్ ప్రూ ఫ్,ఫోటో,నర్సరీ ఏర్పాటు భూమి రికార్డు పత్రాలు,ధరకాస్తు దారుడు భూమి యాజి మాని కాక పోతే లీజ్ అగ్రీ మెంట్, స్థలం లే అవుట్ ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్వైయిర్ తయారు చేసిన పత్రం, నీరు,ఇతర సౌకర్యాలు వివరాలు, బూ గర్బ జల శాఖ, భూమి పరిశోధన సంస్థ నివేదికలు, గడిచిన 3 యేళ్లు గా ఆ భూమిలో వేసిన పంటలు వివరాలు, నర్సరీ పేరు ,అందుకు సమధించిన ఫ రం రిజి స్టేషన్ డాక్యుమెంట్ ,కరెంట్ కనెక్షన్ వివరాల తో ఆన్లైన్ ఉద్యాన వన శాఖ వెబ్ లో నమోదు చేయాలి.అధికారులు పరిసి లించి లైసెన్స్ ఇస్తారు.
అనుమతి తరువాత
నర్సరీ ఏర్పాటు అనంతరం అక్కడ పని చేసే సిబ్బంది వివరాలు,పెంచే మొక్కలు,క్రయ విక్రయాల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలి.ప్రతి కొనుగోలు దారుడు కి జి ఎస్ టి ఐ ఎన్ బిల్లు ఇవ్వాలి. ఆ వివరాలు ప్రతి నే లా ఉద్యాన వన శాఖ కి అంద చేయాలి.కొనుగోలు చేసిన మొక్కలు,నారు వల్ల నష్ట పోతే బాధితులు పరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు.
జరుగుతోంది

-పాలేరు నియోజిక వర్గం లో రెండు చోట్ల ఏర్పాటు చేసిన అనుమతి లేని నర్సరీ యజీమాని నార్లు అమ్మ కానికి ఏకంగా బహిరంగ ప్రకట నఇచ్చారు.విత్తన కంపెనీల బిల్లులు ఇస్తాం అని ప్రకట న,వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర అక్రమం లో ఉన్నట్లు తెలుస్తోంది.నకిలీ విత్తనాలు ను నేరుగా కాకుండా నార్లు గా అమ్మే విధంగా సహకారం అందిస్తున్నారు అనేది తెలుస్తోంది.

వాస్తవ పరిస్థతి ఇది..

– అస్వరావు పేట అసెంబ్లి పరిధి లో కొట్లు రూపాయలు నర్సరీ వ్యాపారం బోర్డు లు పెట్టీ అధికారులు కనుసన్న ల్లో జరుగుతోంది..లక్షలు రూపాయలు సీజన్ లో కమిషన్ ల రూపం లో చేతులు మారుతున్న ట్లు గా ఆరోపణలు ఉన్నయి. అదే ప్రాంతం లో మూడు ప్రభుత్వ నర్సరీ లు సైతం ఉన్నట్లు గా రికార్డుల లో ఉన్నయి.అనుమతి లేని నర్సరీల ధాటికి ప్రభుత్వం వి తట్టు కో లేక పోతున్న యి.

– ఖమ్మం జిల్లా చేగో మ్మ లో ప్రభుత్వ నర్సరీ ఉన్నట్లు రికార్డు ల్లో ఉన్నది.ఆ నర్సరీ పరిస్థితి చెప్పనవసరం లేదు.

– ఖమ్మం నగరం లోని కమాన్ బజార్ లో ఓక నివాస బవంతికి ఇక్కడ మొక్కలు అమ్మబడును,నర్సరీ అంటూ బోర్డ్ పెట్టారు.ఇలా వందల కొద్ది అనుమతులు లేని వి ఉన్నయి

కంపెనీల బిల్లులు ఇస్తాం :ప్రకట న
-రైతులందరూ అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించవలసిన నెంబర్లు
+919666774822
+919603421059+919640320436
నోట్ :- పైన పేర్కొన్న అన్ని రకముల నార్లకు కంపెనీ బిల్స్ ఇవ్వబడును..
.
ఒక్కరీ కే లైసెన్స్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లోని మోరం పల్లి బంజర కు చెందిన సూరపు రెడ్డి నారపు రెడ్డి భద్రాద్రి నర్సరీ పేరున లైసెన్స్ (నెంబర్ 21/TSN/BOK) పొందారు.2024 లో వరకు ఇతనికి లైసెన్స్ ఉంది.(అనుమతి లేకుండా నే, అక్రమ సౌకర్యాలు,ప్రభుత్వ భూమి కబ్జాలు మరో కథనం లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube