ఏఎస్ఐ కుటుంబానికి భద్రత చెక్

టీ మీడియా,మార్చి 3

0
TMedia (Telugu News) :

ఏఎస్ఐ కుటుంబానికి భద్రత చెక్

 

 

టీ మీడియా,మార్చి 3  :రామగుండం  గోదావరిఖని :రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్           లో విధులు నిర్వహిస్తు మహిళా ఏఎస్ఐ 2034 భాగ్య లక్ష్మి గత సంవత్సరం లో రోడ్డు ప్రమాదం లో మరణించగా భర్త కుటుంబ సభ్యులకు భద్రత నుండి ద్వారా వచ్చిన 8,00,000 లక్షల రూపాయల చెక్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్,గురువారం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మరణించిన ఏఎస్ఐ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు.పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, అన్నారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పర్వీజ్ నిజాం,సిసి శ్రవణ్ కుమార్, రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్ల కుంట పోచలింగం,పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube