ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం

ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం

1
TMedia (Telugu News) :

ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం

టీ మీడియా, జూలై 15, జన్నారం:

మండలంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం చోటుచేసుకుంది .వివరాల్లోకెళ్తే తాళ్లపల్లి నరేష్ అనే వ్యక్తి బుధవారం రోజున ఉదయం ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఎక్స్ పవర్ పెట్రోల్ 2800 రూపాయల పెట్రోల్ తన కారులో పోయించుకొని పాపకు పాపకు ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి తీసుకురావడానికి అలాగే మున్యాల్లో గల ముప్పు ప్రాంతంలో ఉన్న ప్రజలను తీసుకురావడానికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళగానే కారు ఆగిపోయింది. వర్షం కారణంగా కారు ఆగిపోయిందని నరేష్ అను వ్యక్తి వేరే వాహనంలో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చి గురువారం రోజున ఉదయం కారు దగ్గరికి చేరుకొని మెకానిక్ ని పిలిచి చూపియగా సదరు మెకానిక్ పెట్రోల్ బయటకు తీయగా పెట్రోల్ లో వాటర్తో కలిసి ఉండడంతో కారు పనిచేయట్లేదని తెలియజేశారు.

 

Also Read : అభివృద్ధి పథంలో వనపర్తి ఎమ్మెల్యే

ఆ పెట్రోల్ తీసుకొని నరేష్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో సంప్రదించి బంక్ మేనేజర్ ని సంప్రదించగా ఎటువంటి వివరణ ఇవ్వని కారణంగా మండల రెవెన్యూ అధికారి భానుచందర్, జన్నారం మండల ఎస్సై పి సతీష్ లకు ఫిర్యాదు చేయగా వారు మేనేజర్ ప్రేమ్ సాగర్ ని వివరాలు అడగగా కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం వెళ్ళదీశారు. దీనిపై తక్షణమే పెట్రోల్ బంకులు సీల్ వేసి తాత్కాలికంగా సీజ్ చేశారు. నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహిస్తామని వారు తెలియజేశారు .బాధితుడు ఆవేదనతో ఈ బంకులో ఇది మొదటిసారి కాదని తరచూ ఇలానే అవుతున్న అధికారులు వచ్చి ఏదో సాంప్రదాయంగా ఎంక్వయిరీ చేసి వెళ్తున్నారని తమకు పరిష్కారం కావాలని వారు కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube