ప్ర‌త్య‌ర్థిపై కార్ల్‌స‌న్ చీటింగ్ ఆరోప‌ణ‌లు

ప్ర‌త్య‌ర్థిపై కార్ల్‌స‌న్ చీటింగ్ ఆరోప‌ణ‌లు

1
TMedia (Telugu News) :

ప్ర‌త్య‌ర్థిపై కార్ల్‌స‌న్ చీటింగ్ ఆరోప‌ణ‌లు

టీ మీడియా, సెప్టెంబర్ 27, న్యూఢిల్లీ: వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ మ్యాగ్న‌స్ కార్ల్‌స‌న్ చీటింగ్ ఆరోప‌ణ‌లు చేశాడు. ప్ర‌త్య‌ర్థి హ‌న్స్ నీమ్యాన్ ప‌దే ప‌దే చీటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు కార్ల్‌స‌న్ ఆరోపించాడు. త‌న ట్విట్ట‌ర్‌లో దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు. సిన్‌క్యూఫీల్డ్ క‌ప్ నుంచి వైదొలిగిన నేప‌థ్యంలో కార్ల్‌స‌న్ తన ట్వీట్‌లో వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. గ‌తంలో చీటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఇటీవ‌ల నీమ్యాన్ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే.

Also Read : భక్తులకు టీటీడీ కీలక సూచనలు

దాన్ని గుర్తు చేసిన కార్ల్‌స‌న్‌.. అలాంటి ప్లేయ‌ర్‌తో ఆడ‌లేన‌న్నాడు. ఆన్‌లైన్‌లోనే కాదు.. బోర్డ్ ప్లేలో కూడా నీమ్యాన్ చీటింగ్ చేసిన‌ట్లు కార్ల్‌స‌న్ పేర్కొన్నాడు. ఇటీవ‌ల సెయింట్ లూయిస్‌లో జరిగిన ఓ టోర్న‌మెంట్‌లో నీమ్యాన్ చేతిలో కార్ల్‌స‌న్ ఓట‌మి పాల‌య్యాడు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షాకింగ్ రీతిలో ఆ టోర్నీలో నిష్క్ర‌మించాడు. అయితే ప్ర‌త్య‌ర్థిపై తొలిసారి కార్ల్‌స‌న్ ప‌బ్లిక్‌గా చీటింగ్ ఆరోప‌ణ‌లు చేశాడు. కేవ‌లం త‌న కెరీర్‌ను దెబ్బ‌తీసేందుకు త‌న‌పై కార్ల్‌స‌న్ చీటింగ్ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు నీమ్యాన్ ఆరోపించాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube