చిట్టీల పేరుతో రు 3 కోట్ల మోసం.
టీ మీడియా, మార్చి 31,రామచంద్రపురం : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం లో ఘరానా మోసం వెలుగు చూసింది చిట్టీల పేరుతో కర్రీ వెంకట రామ రెడ్డి అనే వ్యక్తి స్థానికులను మోసం చేశాడు.చిట్టీల పేరుతో చిరు వ్యాపారులను, మధ్య తరగతి ప్రజలను నమ్మించి పక్క పథకం ప్రకారం క్యాష్ చేసుకుని సుమారు 3 కోట్ల రూపాయలతో కర్రీ వెంకట రామారెడ్డి పరారయ్యాడు.కర్రీవెంకటరామారెడ్డిఆచూకీకనిపించకపోవడంతో బాధితులు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.చిట్టీల పేరుతో మోసం చేసిన కర్రీ వెంకట రామారెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ సొమ్ములు ఇప్పించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ బాబుకురామచంద్రపురం సీఐ శ్రీనివాస్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి నమ్మకంగా మా షాపు వద్దకు, మా ఇంటి వద్దకు వచ్చి చిట్టిలు కట్టించికునేవాడని ఈనెల ఒకటో తారీఖున కాశీ వెళ్లి వచ్చిన తర్వాత చీట్టి పాడిన సభ్యులకు డబ్బులు ఇస్తానని చెప్పి తిరుగు రాలేదని అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా భార్య పిల్లలతో పరారాయ్యాడని తెలుసుకున్నామని అన్నారు. సుమారు రెండు వందల మంది సభ్యుల పైనే బాధితులు ఉంటారని కర్రీ వెంకట రామా రెడ్డి ఎక్కడున్నా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Also Read : ఆదిత్య మిట్టల్తో మంత్రి కేటీఆర్ భేటీ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube