స్కానింగ్ సెంటర్ తనిఖీ చేసిన వైద్యాధికారి

స్కానింగ్ సెంటర్ తనిఖీ చేసిన వైద్యాధికారి

1
TMedia (Telugu News) :

స్కానింగ్ సెంటర్ తనిఖీ చేసిన వైద్యాధికారి

టీ మీడియా, జులై 6, వనపర్తి బ్యూరో : వనపర్తిలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ దగ్గర గల మానిక్ డయగ్నోస్టిక్(స్కానింగ్)సెంటర్ ను వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిఎం అండ్ హెచ్ఓ) డాక్టర్ రవి శంకర్ మంగళవారం తనిఖీ చేశారు. స్కానింగ్ డాక్టర్ లేరని, స్కానింగు రిజిస్ట్రేషన్ లో నమోదు ఆయిన డాక్టర్ ఉండాలని, ఫైర్ సేఫ్టీ సీలిండర్ దాచి పెట్టారనిగుర్తించారు. రోగులకు సంబంధించిన రిజిస్టర్ ఉపయోగించడం లేదని సిటీస్కానింగు నివేదిక ప్రతి నెల డిఎంహెచ్ఓ కార్యాలయానికి పంపలేదు.పొరపాట్లు సరిదిద్దుకోవాలని డాక్టర్ రవి శంకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారి చంద్రయ్య, మధు,నర్సింహ రావు పాల్గొన్నారు.

 

Also Read : మలేరియా, డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి

కాగా వనపర్తి మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అఖిలపక్షం కన్వీనర్ సతీష్ యాదవ్ ప్రయివేటు ఆసుపత్రులు,స్కానింగు సెంటర్ల గురించి జిల్లా కలెక్టర్ షేక్ యష్మిన్ భాషకు పిర్యాదు చేశారు. అవసరం లేకున్నా టెస్టింగులు,స్కానింగులకు రెఫర్ చేస్తున్నారని మంత్రులు నిరంజన్ రెడ్డికి,హరీష్ రావుకు పిర్యాదు చేస్తామని సతీష్ యాదవ్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube