చెక్ పోస్టులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

చెక్ పోస్టులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

1
TMedia (Telugu News) :

చెక్ పోస్టులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

 

టి మీడియా, జూన్ 29,ఖమ్మం:

జిల్లాలో అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.అక్రమ రవాణా మార్గాలపై దృష్టి కేంద్రీకరించిన పోలీస్ శాఖ..జిల్లా వ్యాప్తంగా ఎనిమిది చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ చెక్ పోస్ట్ లను అకస్మీకంగా సందర్శించారు. వెంకటగిరి క్రాస్ రోడ్డు, శ్రీశ్రీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅక్రమ రవాణా మార్గాలపై దృష్టి కేంద్రీకరించిన పోలీస్ శాఖ..అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని పెర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు హాని కలిగించే ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు గంజాయి, గుట్కా వంటి విక్రయాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని,అదేవిధంగా అక్రమ వ్యాపార మూలాలపై దృష్టిపెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కట్టడి చేస్తున్నామని తెలిపారు.

 

Also Read : మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం

 

పశువులు, ఆవులు, లేగదూడల అక్రమ రవాణా నియంత్రణ కోసం సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ద్వారాప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా తరలిస్తే చర్యలు తప్పవన్నారు.జిల్లా వ్యాప్తంగా నమోదైన ఎన్‌.డి.పి.ఎస్‌ యాక్ట్‌ కేసుల పర్యవేక్షణకు వేదికగా చేసుకొని మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాల హాట్‌ స్పాట్‌ల గుర్తింపు, ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌/మాదకద్రవ్యాల నేరస్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయడం ద్వారా దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.మానవ అక్రమ రవాణా మొదలు నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై పోలీసులు దృష్టి సారించి.. ఇతర రాష్ట్రాలలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించి జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాలపై అధికారులు పటిష్ట నిఘా పెట్టారని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube