అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

1
TMedia (Telugu News) :

అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

టి మీడియా,జులై5,కర్నూలు: జిల్లా ఆదోని మండలం బైచిగేరి సమీపంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదోని- ఎమ్మెగనూరు ప్రధాన రహదారి పక్కన పొలాల్లో చిరుత కళేబరాన్ని గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించి గ్రామస్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.చిరుత వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

 

Also Read : పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత

అనంతరం చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని ఆదోనిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. పశువైద్యాధికారితో శవపరీక్ష నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ రేంజ్‌ అధికారిణి స్ఫూర్తి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube