కూనో నేషనల్‌ పార్క్‌లో లార్జర్‌ ఎన్‌క్లోజర్‌లోకి చీతాలు

కూనో నేషనల్‌ పార్క్‌లో లార్జర్‌ ఎన్‌క్లోజర్‌లోకి చీతాలు

1
TMedia (Telugu News) :

కూనో నేషనల్‌ పార్క్‌లో లార్జర్‌ ఎన్‌క్లోజర్‌లోకి చీతాలు..

టీ మీడియా,నవంబర్6, భోపాల్‌ : ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన చితాలను లార్జర్‌ ఎన్‌క్లోజర్‌లోకి వదిలే ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 17న నమీబియా నుంచి ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌కు తరలించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆ చీతాలు క్వారంటైన్‌లో ఉన్నాయి. తాజాగా వాటిని లార్జర్‌ ఎన్‌క్లోజర్‌లోకి వదిలే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు మగ చీతాలను క్వారంటైన్‌ నుంచి బయటకు పంపించారు. ఆ రెండు చీతాలు లార్జర్‌ ఎన్‌క్లోజర్‌లో ఎలా ఉంటాయనే విషయాన్ని పరిశీలించి మిగిలినవాటిని కూడా వదిలేయనున్నారు.

Also Read : ఐదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్

క్వారంటైన్ ప్రాంతంలో అవి అలవాటు పడ్డాయని, వాటిని పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి పంపించామని కూనో నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రకాశ్‌ కుమార్ తెలిపారు. ఇప్పుడు అవి కొంత ఎక్కువ విస్తీర్ణంలో బహిరంగంగా వేటాడవచ్చని చెప్పారు. మిగిలిన ఆరు చిరుతలను కూడా దశల వారీగా విడుదల చేస్తామన్నారు. కాగా, దేశంలో చివరి చీతా 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. దీంతో 1952లో ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube