
అక్రమ రిజిస్ట్రేషన్ కు అండ గా అధికారులు
-కలెక్టర్ ఆదేశించిన కదలని యంత్రంగం
-యథేచ్ఛగా నిర్మాణ పనులు
టి మీడియా, ఫిబ్రవరి12,మధిర: స్థానిక ఎండివో కార్యాలయం సమీపంలో లోని స్టలం ప్రభుత్వానిది తక్షణం స్వాధీనం చేసుకోవాలని ఇటీవల అధికారులు ను ఆదేశించారు. వ్రాత పూర్వక ఆదేశాలు ఇచ్చారు.రిజిస్ట్రేషన్ లు చెల్లుబాటు కావు అన్నారు.
ఆదేశాలు అమలు చేయాల్సి న అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్ కు అండ గా నిలిచారు.స్థలము కట్టడాన్ని స్వాధీనం చేసు కోలేదు.అటువైపు కన్నెత్తి చూడ లేదు. అక్రమ పద్ధతుల్లో రిజిస్టేషన్ పొందిన వ్యక్తి తిరిగి పనులు చేస్తుండం శనివారం కనిపించింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం లో ఇప్పటికే లక్షలు చేతులు మారాయి ఆనే ప్రచారము ఉన్నది.ప్రభుత్వ స్థలం దర్జా కబ్జా చేసి నిర్మాణము చేసి నా వ్యవ హారం లో అధికారులు కలెక్టర్ ఆదేశాలు అమలు చేయక పోవడం వెనుక ఖహాని ఏంటి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయం గురించి పట్టణ ప్రణాళిక విభాగం అధికారి భాస్కర్ ని వివరణ కోరగా పరిశీలిస్తాము, మాకు తెలియదు అని ముక్త సరిగా సమాధానం ఇచ్చారు .మొత్తం విషయం పరిశీలిస్తే కబ్జా దారులకు అధికారులు అండ అనేది స్పష్టం అవుతోంది