అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన సి ఐ

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన సి ఐ

1
TMedia (Telugu News) :

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన సి ఐ
టీ మీడియా , మార్చి 29,అశ్వారావుపేట:మండలం లోని వినాయక పురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి జాతర బుధవారం నుండి ఐదు రోజుల పాటు ప్రతి రోజు వేలాదిమంది భక్తులతో అంగరంగ వైభవంగా జరుగబోతున్న నేపథ్యంలో మంగళవారం అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేందర్,ఆలయ ఈఓ శేషయ్య తో జాతర ఏర్పాట్లను పరిశీలించారు.రేపు ప్రారంభోత్సవం కి వస్తున్న వి ఐ పి లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ఈ ఐదు రోజులపాటు జాతర లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రాంమూర్తి,ఆలయ సహాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తెలుగుదేశం ఆవిర్భావ ఉత్సవాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube