వేములవాడ మండలంలోని శాత్రాజపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారు మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి
మొదటగా పిఎంజిఎస్వై నిధులు 3 కోట్ల 8 లక్షలతో మంజూరైన శాస్త్రాజ్పల్లి నుండి నాగయ్య పల్లె రోడ్డుకు భూమి పూజ చేశారు.
అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఇట్టి పాఠశాలల్లో పలు మౌలిక వసతులు ఏర్పాటు చేయవలసిందిగా ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యే చెన్నామనేని ని కోరినారు. ఇట్టి విషయమై ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందిస్తూ వారి యొక్క అవసరాలను తీర్చుతానని హామీ ఇచ్చారు…
తదనంతరం గ్రామంలో నిర్మించిన రైతు వేదిక ను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతులకు ఒక వేదికను మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు వేదికను ఉపయోగించుకోవాలి అని తెలిపారు. వరికి బదులుగా లాభసాటి అయిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. వ్యవసాయాధికారులు రైతులకు పంట మార్పిడి పై అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రాధాన్యత అసలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇవ్వరని తెలిపారు. గత ప్రభుత్వాలలో మన రైతులు పడ్డ కష్టాన్ని ఎంతగానో చూశాం.
ఇప్పుడు రైతులకు ఇబ్బంది అనేది లేకుండా చేయటమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం.రైతుల గోస తెలిసిన రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ ,రైతులందరు ఒకే చోట కూర్చొని వారి సమస్యలను అధికారులతో చర్చించి లాభదాయకమైన పంటలు పండించి రైతును రాజు చేయాలనే తపనతో రైతు వేదికలను నిర్మించడం జరిగిందని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో ఆలోచన చేయాలన్నారు. మన ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజక వర్గం అభివృద్ధికి ఎంత గానో కృషి చేస్తున్నారు అనీ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు గారు, జెడ్పీటీసీ ఏష వాణి తిరుపతి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మండ్లు, స్థానిక కౌన్సిలర్లు విజయ్ జయ రైతు బంధు అధ్యక్షులు జడల శ్రీనివాస్ , పాక్స్ ఛైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, తెరాస నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మండల వ్యవసాయధికారి, ఏఇఓలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, రైతులు పాల్గొన్నారు.
