వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన చెన్నామనేని

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్08 వేములవాడ రూరల్

వేములవాడ నియోజకవర్గం లోని వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ భవనాలకు శంకుస్థాపన చేసిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు మరియు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ రెండు పిహెచ్సి లకు ఒక డాక్టర్ ఉంటారని ఈ పదకొండు పీహెచ్సి లకు ఇటీవలనే వేములవాడ లో ప్రారంభమైన వంద పడకల ఆస్పత్రికి అనుసంధానం చేయబడతాయి అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. వేములవాడ లో ఉన్న వంద పడకల ఆసుపత్రిలో 50 పడకల సిద్ధంగా ఉన్నాయని రోజుకు 300 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని అన్నారు. కరోనా భారీన పడ్డ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించింది అన్నారు. విద్య, వైద్యం లో ప్రభుత్వ పాత్ర గణనీయంగా పెరుగుతుందన్నారు. రానున్న కాలంలో జిల్లాకు మెడికల్ కాలేజ్, మల్టీపర్పస్ హాస్పిటల్ రాబోతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో వైద్యానికి పెద్దపీట వేస్తామన్నారు.

Chennamaneni started several development works

తదుపరి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి కృషితో నియోజకవర్గానికి ఒక కోటి డెబ్బై ఆరు లక్షల నిధులతో 11 హెల్త్ సబ్ సెంటర్ ల భవన నిర్మాణం మంజూరీ అయినాయి. మన ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ, అన్ని రంగాల్లో మండలాలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారు. హెల్త్ సబ్ సెంటర్ల వలన గ్రామాలలో ప్రజలకు సరైన సమయంలో ప్రాథమిక వైద్యం అందుతుంది. ప్రతి రెండు హెల్త్ సబ్ సెంటర్ లకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో ఉంటాడు అని తెలిపారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు విద్య, వైద్యానికి పెద్ద పీట వేయడం జరుగుతుందనీ అన్నారు.

అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ సంవత్సరంలో రెండు కోట్లు కేటాయిస్తానని మరో కోటి రూపాయలను సేవ్స్ ద్వారా నిధులు వెచ్చించి, పాఠశాలలో మౌలిక వసతులు టాయిలెట్స్, బెంచెస్, క్రీడా సామాగ్రి, కాంపౌండ్ వాల్స్ ఇతరాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారికి పాఠశాలలో కావాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఇట్టి కార్యక్రమంలో వేములవాడ రూరల్ జడ్పిటిసి ఏశ వాణి తిరుపతి , ఏఏంసి చైర్మన్ గడ్డం హనుమాన్లు , సర్పంచ్ తిరుపతి , ఎంపిటిసి శంకరవ్వ , ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Chennamaneni started several development works in Vemulawada constituency.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube