కానిస్టేబుల్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందజేత

కానిస్టేబుల్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందజేత

1
TMedia (Telugu News) :

కానిస్టేబుల్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందజేత

టీ మీడియా మార్చి 22 రాజన్న సిరిసిల్లా:జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తు ఇటీవల మరణించిన లోకిని తిరుపతి కుటుంబానికి లక్ష రూపాయల ఎక్సగ్రెసియా చెక్ అందజేశారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ. ఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నా తిరుపతి విధులు నిర్వహిస్తు రోడ్ ఆక్సిడెంట్ లో మరణించారు. తన కుటుంబానికి లక్ష రూపాయల ఎక్సగ్రెసియా చెక్ ను వారి కుటుంబానికి ఈ రోజ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి హమ్మదుల్లా ఖాన్ తిరుపతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : 23 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube