ఎంపీ నామ చొరవతో రూ. 3 లక్షల రూపాయల చెక్కు మంజూరు

ఇంటికి వెళ్లి చెక్కు అందించన ఎంపీ నామ

1
TMedia (Telugu News) :

ఎంపీ నామ చొరవతో రూ. 3 లక్షల రూపాయల చెక్కు మంజూరు
-ఇంటికి వెళ్లి చెక్కు అందించన ఎంపీ నామ
టీ మీడియా, మార్చి 28,ఖమ్మం: కార్పొరేషన్ దానావాయిగూడెం కు చెందిన పెడవల్లి రుక్మిణమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొంది అనంతరం అక్కడ వారికి అయిన ఖర్చును కుటుంబ ఆర్దిక పరిస్థితి దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఇప్పించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు సిఫార్సు తో సీఎం సహాయ నిధి నుండి ఆమెకు రూ.3 లక్షల రూపాయల సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కు మంజూరు చేశారు. కాగా ఆదివారం నాడు నేరుగా లబ్ధిదారుని నివాసానికి వెళ్లిన ఎంపీ నామ నాగేశ్వరరావు వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించి చెక్కును అందజేశారు.

Also Read : భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం

ఆపద సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ నామ భరోసానిచ్చారు.. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు గోపాల్, జడ్పీటిసి యండపల్లి వరప్రసాద్, కార్పొరేటర్ బట్టపోతుల ఉషారాణి, కిలారి రాంబాబు , డా.కిలారి సునీల్, కిలారి ఉదయ్ ,సతీష్, రాముల రవి, గ్రామశాఖ సతీష్, బాణాల వెంకటేశ్వరరావు, సామినేని సతీష్, నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube