టీ ఆర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేత

టీ ఆర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేత

1
TMedia (Telugu News) :

టీ ఆర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేత

టి మీడియా మే 05 లక్షెట్టిపేట:మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన సామల సత్యనారాయణ అనే టీ ఆర్ ఎస్ కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబానికి టీ ఆర్ ఎస్ పార్టీ తరపున మంజూరైన రూ.2 లక్షల ప్రమాద భీమా చెక్కును టీ ఆర్ ఎస్ యువ నాయకులు నడిపల్లి విజిత్ రావు బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా విజిత్ రావు మాట్లాడుతూ…. టీ ఆర్ ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతామని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సంక్షేమానికి టీ ఆర్ ఎస్ పార్టీ కట్టుబడి ఉందని వివరించారు.

Also Read : వడదెబ్బ తో వ్యకి మృతి

సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.కార్యకర్తలే పార్టీ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యకర్తలకు ఎమ్మెల్యే దివాకర్ రావు,నడిపల్లి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ లింగన్న,నాయకులు ఉమపతి రావు,వెంకటేష్, శ్రీనివాస్,బాపు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube