చికెన్ మటన్ మాంసం దుకాణాదారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 14

నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట లో చికెన్,మటన్ మాంసం దుకాణాదారుల సంఘం మంగళవారం స్థానిక సంత మార్కెట్ నందు సమావేశమై నూతన కమిటీని ఏఐటీయూసీ నాయకులు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చికెన్ మటన్ మాంసం దుకాణాల మండల గౌరవ అధ్యక్షుడిగా సయ్యద్ రఫీ, అధ్యక్షుడిగా పంచి దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కే బాజీ లను ఎన్నుకొన్నారు. వారితో పాటు మరో 9 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సయ్యద్ రఫీ మాట్లాడుతూ చికెన్ మటన్ మాంసం దుకాణదారులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి వ్యాపారాలు కి అనువైన చోటు దగ్గర నీటి సదుపాయం డ్రైనేజ్ సౌకర్యాలు లేక వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని,మాసం ప్రియులకు నాణ్యమైన మాసం అందించటంలో సంఘం కట్టుబడి ఉందని, వారి న్యాయమైన చిన చిన సమస్యలపై అధికారులకు, ప్రజా ప్రతినిధులు లకు త్వరలో నూతన కమిటి ఆధ్వర్యంలో వినతిపత్రలను అందిస్తామని అన్నారు.

సీపీఐ జిల్లా నాయకులు సయీద్ సలీం మాట్లాడుతూ సంఘం సభ్యుల ఏఐటీయూసీ అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తుందని ఎటువంటి సమస్యలు వచ్చినా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో పలువురు ఏఐటీయూసీ నాయకులు మాంసం దుకాణాలు దారుల సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube