అధ్యక్షపదవి నుంచి తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి

అధ్యక్షపదవి నుంచి తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి

1
TMedia (Telugu News) :

అధ్యక్షపదవి నుంచి తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి

టీ మీడియా, నవంబర్ 18, శ్రీనగర్‌ : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్‌ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆయన కుమారుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా.. ఎన్సీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నది. ఫరూఖ్‌ అబ్దుల్లా.. 1980లో శ్రీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నియ్యారు.

Also Read : అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

మరుసటి ఏడాదే అంటే 1981, ఆగస్టులో జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (JKNC) పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి షేఖ్‌ అబ్దుల్లా అప్పటివరకు ఆ పదవిలో కొనసాగారు. అయితే ఆయన మృతితో ఫరూఖ్‌ అబ్దుల్లా పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం 1982లో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు. మొత్తం నాలుగుసార్లు కశ్మీర్‌ సీఎంగా ఆయన పనిచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube