ముఖ్యమంత్రి ఎదుట ఆందోళన చేస్తాం

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 12 వనపర్తి : వనపర్తి పట్టణంలో 1996లో సర్వేనెంబర్ 312, 335 చిట్యాల దగ్గర 8.36 గుంటల భూమి ప్రభుత్వంతో కొనుగోలు చేయించి 223 ప్లాట్లుగా చేస్తే అందులో బిసిలకు 54, ఎస్సీలకు 91, మైనార్టీలకు 76 ప్లాట్లు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి కేటాయింపులు చేశారు. అనివార్య కారణాల వల్ల ఇల్లు నిర్మించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవం మంత్రి పట్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆర్డిఓ చంద్రారెడ్డి సమక్షంలో హామీ ఇచ్చారు. అదే రోజు ఆర్డీవో పట్టాదారులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అందజేయాలని పరిశీలించి ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినారు. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు తెలుగుదేశం పార్టీ పట్టాదారులు తరఫున అనేక ఉద్యమాలు చేసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన నేటికీ న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వారికి ఇండ్లు కేటాయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

లేనిపక్షంలో పట్టాదారులతో కలిసి డబల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర సీఎం ఎదుట నిరసన వ్యక్తం చేసి న్యాయం చేయాలని కోరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి దస్తగిరి, సోషల్ మీడియా కార్యదర్శి ఎండి గౌస్, బాలయ్య, బాలరాజు, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube