యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు
లహరి, జనవరి 18, యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని ముగ్గురు సీఎంలు దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్కు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వారితోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో సత్కరించారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : గుడికి ఎందుకెళ్తారు..
గుట్టలో సుమారు 1600 మంది పోలీసులను మోహరించారు. దర్శనం అనంతరం సీఎంలు ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు వెళ్తారు. సీఎంల టూర్ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు దర్శనం, అర్జిత సేవలకై భక్తులకు అనుమతి లేదని ఆలయ ఈవో తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube