నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

1
TMedia (Telugu News) :

నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

టీ మీడియా,సెప్టెంబర్ 26, రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. మున్సిపాలిటీలోని సోలిపూర్‌లో ఉన్న ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. గ్రామానికి చెందిన అక్షిత్‌ గౌడ్‌, ఫరీద్‌, పర్వీన్‌.. చేపలు పట్టడానికి నీటిగుంటలోకి దిగారు.

Also Read : ఆశ్చర్యం కలిగిస్తున్న విపక్షాల మాటలు

అది లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు అందులో మునిగి చనిపోయారు. గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. వారంతా పదేండ్లలోపు వారేనని చెప్పారు. అప్పటివరకు కళ్లముందున్న చిన్నారులు విగజీవులుగా మారడంతో వారి తల్లదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube