టీ మీడియా, నవంబర్09, మధిర:
మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో అంగన్వాడి-2 సెంటర్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు హైస్కూల్లో నిర్వహించడం జరిగిందని అంగన్వాడీ టీచర్ కమలాకర్ పుష్ప తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఆటల పాటల ను నిర్వహించడం జరిగిందన్నారు.బాలికల్లో రక్తహీనత, బాల్య వివాహాల నివారణ గురించి తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.