సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు
టీ మీడియా,డిసెంబర్ 23,కరకగూడెం:
మిర్చి పంట వైరస్ ఆశించి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వంఆదుకోవాలని మిర్చి పంటకు వచ్చిన వైరస్ను ప్రకృతి విపత్తు గా ప్రభుత్వం గుర్తించాలని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం కరకగూడెం మండల కార్యదర్శి కొమరం కాంతారావు డిమాండ్ చేశారు.
సమత్ బట్టుపల్లి గ్రామంలో మిర్చి తోటలను పరిశీలించారు.మిర్చి తోటలో పూత పూసి కాయ కాసే సరికి ఎర్ర నల్లి,నల్ల నల్లి, తామర పురుగు వంటి వైరస్లు ఆశించి పంట మొత్తం బుగ్గిపాలుఅయిపోతయిందని వైరస్ నివారణ గాను రైతన్నలు వేలకు వేలు బయట ప్రైవేట్ అప్పులు తేవటం ద్వారా అప్పులపాలవుతున్నారని పట్టా భూమి, కౌలు భూమి వేసిన రైతుల పంట మొత్తం వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణమే సర్వేలు జరిపి పంట నష్టాన్ని అంచనా వేయాలని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్వ సత్యం, శంకరయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు