చైనా మాజీ ప్రధాని లీ కియాంగ్ కన్నుమూత
టీ మీడియా, అక్టోబర్ 27, బీజింగ్ : చైనా మాజీ ప్రధాని లీ కియాంగ్ కన్నుమూశారు. ఆయన వయసు 68 ఏళ్లు. గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లో లీని ప్రధాని పదవి నుంచి తప్పిస్తూ అధ్యక్షుడు జీ జిన్‌పిగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లీ కియాంగ్ చైనా భవిష్యత్తు అధ్యక్షుడు అవుతారన్న ఊహాగానాలు ఓ దశలో వినిపించాయి. షాంఘైలో రెస్టు తీసుకుంటున్న ఆయనకు గురువారం అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చినట్లు ఆ దేశ మీడియా పేర్కొన్నది. అర్థరాత్రి ఆయన ప్రాణం విడిచినట్లు మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ సర్కారులోనే ఆయన పదేళ్లు ప్రధానిగా చేశారు. ఈ ఏడాది ఆరంభంలో లీ కియాంగ్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించారు. జీ జిన్‌పింగ్ గ్రూపుతో లీ సంబంధాలు బలహీనపడడం వల్లే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారు. రిటైర్ అయ్యే వరకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో ఆయన రెండవ శక్తివంతమైన నేతగా కొనసాగారు. ఈ జనరేషన్‌కు చెందిన స్మార్ట్ రాజకీయవేత్తగా ఆయనకు గుర్తింపు ఉన్నది. లీ కియాంగ్ మృతి పట్ల చైనీయులు షాక్ వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. లీ కియాంగ్ చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచచారు. ఆయన ఓ స్థానిక అధికారి ఇంట్లో జన్మించారు.
Also Read : నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
1955లో అనుహువై ప్రావిన్సులోని డింగ్‌యువాన్ కౌంటీలో పుట్టారు. అన్ని దశల్లో ఆయన పనిచేశారు. చాలా చిన్న వయసులోనే గవర్నర్‌గా ఎదిగారు. పోలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో కూడా ఆయన చిన్నవయసులోనే చేరారు. మాజీ దేశాధ్యక్షుడు హు జింటావో స్థాయికి లీ కియాంగ్ చేరుకుంటారని ఓ దశలో ఊహాగానాలు వినిపించాయి. హు జింటావో అండదండలు లీ కియాంగ్ కు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యేయి. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన పార్టీ నుంచి తొలిగే వరకు పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆర్ధిక విధానాల్లో లీ కియాంగ్ నిర్ణయాలు చాలా సూక్ష్మంగా ఉండేవి. సంపన్నులు, పేదల మధ్య గ్యాప్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. ప్రతి ఒక్కరికీ హౌజింగ్ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube