అమెరికాను దాటేస్తోన్న చైనా..!

అన్ని రంగాల్లోనూ అమెరికాను దాటేస్తోన్న చైనా..!

0
TMedia (Telugu News) :

అన్ని రంగాల్లోనూ అమెరికాను దాటేస్తోన్న చైనా..!

టీ మీడియా,అక్టోబర్ 16,ఇటర్నెట్ డెస్క్:అమెరికా అగ్రరాజ్యంగా ఉన్న ఏకధ్రువ ప్రపంచం అంతరించి, రేపటి ప్రపంచక్రమంలో రష్యా, చైనా శక్తులుగా అవతరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా వేగంగా క్షీణిస్తున్నది. డాలరు ప్రపంచ రిజర్వు కరెన్సీగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నది. డాలర్ స్థానంలో క్రాస్‌ బార్డర్‌ కరెన్సీల మారకం పెరిగింది. షాంఘై సహకార సంఘం (ఎస్‌.సి.వో)లోని దేశాలన్నీ చైనా కరెన్సీ యువాన్‌తో మారకం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చైనా యువాన్‌ ప్రత్యామ్నాయ కరెన్సీగా ఉద్భవిస్తోంది. కొన్ని దేశాలు యువాన్‌ను డాలరుకు ప్రత్యామ్నాయ రిజర్వు కరెన్సీగా పరిశీలిస్తున్నాయి. కొన్నైతే నేరుగా అమలు చేస్తున్నాయి.

 

also read :శాంతంగా కొనసాగుతున్న గ్రూప్-1 ప్రిలిమినరీ

మధ్య ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌, సౌత్‌ అమెరికాలోని కొన్ని దేశాలు యువాన్‌ను అంగీకరించే సంకేతాలున్నాయి. బ్రెజిల్‌లో వామపక్ష విజయం దక్షిణ అమెరికాలో యువాన్‌ వ్యాప్తికి ఊపు నివ్వవచ్చు. అనేక ప్రాజెక్టులతో చైనా దక్షిణాఫ్రికా ఖండంలో శక్తిగా ఎదిగినందున యువాన్‌ వ్యాప్తికి అక్కడా ఆటంకం లేకపోవచ్చు.

చాలా రంగాల్లో అమెరికాను చైనా దాటిపోయింది. చైనా ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా ఉంది. నాలుగు దశాబ్దాలలో అత్యాధునిక భారీ ఆర్థిక శక్తిగా, సాఫ్ట్‌ పవర్‌గా ఎదిగింది. అమెరికాతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలతో భారీ వాణిజ్య మిగులును కలిగి ఉంది. అమెరికా ట్రెజరీ బాండ్స్‌ని చైనా భారీ ఎత్తున కొనుగోలు చేసింది. చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు నాలుగు ట్రిలియన్‌ డాలర్లు. భవిష్యత్తులో కూడా ఇంత భారీ విదేశీ మారక ద్రవ్య నిలువలు, వాణిజ్య మిగులు ఏ దేశమైనా సాధించటం అసాధ్యమేమో. బెల్ట్‌ అండ్‌ రోడ్డుతో 160 దేశాలలో అత్యాధునిక భారీ మౌలిక సదుపాయాలను నెలకొల్పుతున్నది చైనా. గ్లోబల్‌ బిడ్డింగ్‌లో జి–7 దేశాల కంటే తక్కువతో అనేక ప్రాజెక్టులను చేపడుతున్నది.

మునుగోడులో నామినేషన్ వేసిన మరో టీఆర్ఎస్ నేత

యూరోప్‌, అమెరికా, అనేక దేశాలలో పశ్చిమ దేశాల సాంకేతికతలను తలదన్నే వంతెనలను నిర్మించింది. ప్రపంచ ప్రథమ ఎక్స్‌పోర్ట్‌ ఓరియంటెడ్‌ ఎకానమీగా మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతి సరుకును ఏ దేశం చేయనంత చౌకగా, నాణ్యంగా తయారు చేస్తోంది. చైనా సరుకుల దిగుమతిని నిషేధించిన ఏ దేశమైనా నిలదొక్కుకోవడం కష్టం.
అమెరికాతో అన్ని రంగాలలో పోటీ పడే సాంకేతికతలను చైనా సాధించింది. ప్రపంచ మౌలిక సదుపాయాల కల్పనలో ఏ పశ్చిమ దేశమూ నేడు చైనాతో పోటీ పడే స్థాయిలో లేదు. పాసెంజర్స్‌ వాహనాలలో అమెరికాను అధిగమించింది. న్యూ ఎనర్జీ వాహనాలలో ప్రపంచ మార్కెట్లో చైనా వాటా 60 శాతం దాటింది.

5జి టెక్నాలజీలోనూ అన్ని దేశాలనూ అధిగమించింది. చైనా హువావేను అమెరికా అడ్డుకునే ప్రయత్నాలన్నీ ప్రపంచమంతటా విఫలమయ్యాయి. అంతరిక్ష పరిశోధనలోనూ చైనా ముందంజలో ఉంది.
1971 ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ డాలరు–గోల్డు మార్పిడిని రద్దు చేసారు. నాటి నుంచి నేటి వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంతో సంబంధం లేకుండా పేపరు డబ్బును భారీ ఎత్తున ముద్రించి ప్రపంచమంతా పంపిణీ చేస్తున్నది. నాటి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ లోటు భారీగా పెరుగుతూనే ఉంది. మిగులులో లేదు. యుద్ధాలు, ఆంక్షలు, హామీలతో డాలరు ప్రపంచాధిపత్యాన్ని సంపాదించింది. ఒత్తిడితో, కృత్రిమ బలంతో డాలరు పెరిగింది. అమెరికా అప్పు 28 ట్రిలియన్‌ డాలర్లకు చేరినా, డాలరు ప్రపంచ రిజర్వు కరెన్సీగానే కొనసాగింది. ట్రెజరీ బాండ్స్‌ పేరిట, చైనా తదితర అనేక దేశాలకు అమెరికా భారీగా అప్పు పడి ఉంది. ఇది పరస్పర విరుద్ధం.
పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్ చైనా చెల్లింపులు, పెట్టుబడులు, ఫైనాన్సింగ్‌తో విదేశీ మారక ద్రవ్యంగా ప్రపంచంలో చైనా కరెన్సీ రెన్‌మిన్‌బి (ఆర్‌.ఎం.బి.) పాత్ర పెరుగుతోంది. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశీ భాగస్వాములతో భారీ వాణిజ్య ఒప్పందాలన్నీ అధికమైన ఖర్చయ్యే డాలరుతో గాక ప్రధానంగా ఆర్‌.ఎం.బి.తో జరుపుతున్నాయి.

చైనా కేంద్ర బ్యాంకు నివేదిక ప్రకారం వివిధ దేశాలతో రెన్‌మిన్‌బి బ్యాంకేతర రసీదులు చెల్లింపులు 36.6 ట్రిలియన్‌ యువాన్‌లు (5.1 ట్రిలియన్‌ డాలర్స్‌) జరిగాయి. రెన్‌మిన్‌బితో పెట్టుబడి అవకాశాలు, వైవిధ్యపూరిత ప్రయోజనాలు పెరుగుతాయని నిపుణుల విశ్లేషణ.
7వ చైనా–యూరేసియా ఎక్స్‌పో జరిగినప్పుడు మధ్య ఆసియా సరిహద్దు వాణిజ్యం మొత్తం యువాన్‌లో జరపాలని నిర్ణయించారు. మరిన్ని ఎక్కువ ఒప్పందాలు, ఏర్పాట్లు మరిన్ని దేశాలతో చేసుకోవాలని నిర్ణయించారు. చైనా కేంద్ర బ్యాంకు, కజికిస్థాన్‌ కేంద్ర బ్యాంకులు సంయుక్తంగా యువాన్‌ మారకానికి అడ్డంకులు తొలగించాయి. ఈ యూరేసియా ఎక్స్‌పోలో చైనా యువాన్‌ అనేక దేశాలతో కమొడిటీ ఒప్పందాలు చేసుకుంది. ఉజ్బెకిస్తాన్‌, బెలారస్‌లు కూడా డాలర్‌ బదులుగా యువాన్‌తో కలప, ఖనిజాలు, వినియోగ వస్తువుల భారీ ఒప్పందాలను చేసుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా యువాన్‌ ఒప్పందాలు పెరుగుతున్నాయి. డాలరు ఎగబాకుతున్న కాలంలో ప్రపంచంలో యువాన్‌ స్థిరత్వం రీత్యా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ వెంట అనేక దేశాలు యువాన్‌ మారకానికి ముందుకు వస్తున్నాయి.

బహుళ ధ్రువప్రపంచం, ప్రత్యామ్నాయ రిజర్వు కరెన్సీ ప్రపంచ మానవాళికి కొత్త వెలుగును, శాంతిని, సుసంపన్నతను కలిగిస్తాయని ఆశిద్దాం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube