చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత

1
TMedia (Telugu News) :

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత

టీ మీడియా, నవంబర్ 30, బీజింగ్‌ : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. ఆయన వయసు 96 ఏళ్లు. లుకేమియా, బహుళ అవయవ వైఫల్యం వల్ల సొంత నగరమైన షాంఘైలో బుధవారం మధ్యాహ్నం 12.13 గంటలకు జియాంగ్‌ తుదిశ్వాస విడిచినట్లు చైనా అధికార మీడియా తెలిపింది. చైనాలోని అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ, పార్లమెంట్‌, కేబినెట్‌తోపాటు ఆ దేశ ఆర్మీ కూడా జియాంగ్ జెమిన్‌ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. తమకు తీరని లోటు అని పేర్కొంది.

Also Read : రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కాగా, 1989లో టియాన్‌మెన్‌ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై రక్తపాతంతో కూడిన అణిచివేత అనంతర పరిస్థితుల్లో చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీకి జియాంగ్ జెమిన్ నాయకత్వం వహించారు. 1993 మార్చి 27 నుంచి 2003 మార్చి 15 వరకు దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. దౌత్యపరమైన ఒంటరితనం నుంచి చైనాను ఆయన బయటకు తెచ్చారు. అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించారు. తద్వారా అపూర్వమైన చైనా ఆర్థిక వృద్ధికి ఆయన బాటలు వేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube