చిన్నారెడ్డి వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలి
– వ్యక్తిగత ఆరోపణలు ఖండించిన జిల్లా రైతుబంధు అధ్యక్షుడు
– జగదీశ్వర్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 3, పెద్దమందడి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలుపును ఆపడం ఎవరి తరం కాదు అని జిల్లా రైతుబంధు అధ్యక్షులు పి.జగదీశ్వర్ రెడ్డి, అడ్డాకుల జడ్పిటిసి నల్లమద్ధి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెలటూర్ హైవే పక్కన డాబాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వనపర్తి నియోజకవర్గం కాంగ్రేష్ అభ్యర్థి చిన్నారెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఘాటుగా ఖండిస్తూ వెల్టూరు లో బిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సoదర్భంగా జిల్లా రైతుబంధు అధ్యక్షులు పి. జగదీశ్వర్ రెడ్డి, అడ్డాకుల జడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రిపై చేసిన భూ కబ్జా వ్యక్తిగత ఆరోపణను మానుకోవాలి లేదంటే నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా అడ్డుకుంటామని వారు మీడియా ముఖంగా వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గం లో చిన్నారెడ్డి గెలిచినప్పుడు తన సొంత గ్రామమైన తిర్మాలపల్లి లో కూడా సాగునిరు, తాగునిరు అందించని అసమర్డుడు చిన్నారెడ్డి అని మండిపడ్డారు. పెద్దమందడి జెడ్పిటిసి కే.రఘు పతి రెడ్డి మాట్లాడుతూ, బిఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, గతంలో 60 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేసిందని వారు అన్నారు.
Also Read : రాష్ట్రంలో కుల గణనకు ఎపి కేబినెట్ ఆమోద ముద్ర
అలాంటి వ్యక్తి మంత్రి గారిపై ఆరోపణలు చేయడం సరికాదు. ఇప్పటికైనా మానుకోవాలి రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రజల జీవన విధానాన్ని తెలుసుకొని రైతుబంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అనేక రకలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇంతటి బ్రహ్మాండమైన పథకాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకనే ఈ వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని వారు అన్నారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేణు యాదవ్ మాట్లాడుతూ.. ఇతరులపై ఆరోపణలు చేసే సమయంలో, ఆధారలతో చేయాలని లేకుంటే మంత్రి నిరంజన్ రెడ్డి పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే, తగిన మూల్యం చెల్లించక తప్పదని మండి పడ్డారు. మంత్రిపై ఆరోపణలు ఇష్టానుసారంగా చేస్తే, నియోజకవర్గంలో కాలు కూడా పెట్టనీయమని, ఏ గ్రామానికి వెళ్ళిన వ్యతిరేకత మొదలవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్, మండల రైతు బంధు అధ్యక్షుడు రాజప్రకాష్ రెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ పి.విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎన్.శివశంకర్, మాజీ సింగల్ విండో అధ్యక్షులు విట్ట శ్రీనివాస్ రెడ్డి, గ్రామ రైతుబంధు అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, ,
Also Read : ‘మై లార్డ్’ అని అనడం ఆపండి.. నా జీతంలో సగం ఇస్తా
వెలటూర్ గ్రామ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నవీన్ కుమార్ యాదవ్, బలీదుపల్లి ఎంపీటీసీ గణేష్, మణిగిల్ల ఉప సర్పంచ్ పి. శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ దయాకర్, మాజీ వైస్ ఎంపీపీ సాకే వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ సి.వెంకటయ్య, బిఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు సేనాపతి, గొంది భాస్కర్ రెడ్డి, డీఎస్ మహేష్, మలక్ సురేష్, సoబ యాదయ్య,సుద్దబాయి రాజు, దండు నరేష్, పవన్ కుమార్ రెడ్డి, భీమ్ సూర్య, శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube