రైతుల రహదారికి సర్పంచ్ వినూత్న ఆలోచన.

0
TMedia (Telugu News) :

టీ మీడియా వార్త- చింతకాని
చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెడ్డి చెరువుకు పక్కనే ఉన్న వైకుంఠధామం అభివృద్ధిలో భాగంగా ఆ చెరువు పక్కనే ఉన్న పొలాలకు వెళ్లే దారిని మూసివేశారు.దీనివలన రైతులు ఇబ్బంది పడుతున్నారని,ఆ గ్రామ సర్పంచ్ ఆలస్యం నాగమణి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, వైకుంఠధామా రక్షణకు ఎటువంటి ఆటంకం కలగకుండా వినూత్నమైన ప్రణాళికతో రోడ్డు నుండి చెరువుకట్టకు వాడుకలో లేని రహదారికి మరమ్మతులు చేయించి,వాడుకలోనికి తీసుకువచ్చినారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంకా ఈ చెరువు పక్కన ఉన్న పొలాల రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని రైతులు బాగుంటేనే గ్రామం బాగుంటుంది,గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. రహదారికి మరమ్మతులు చేయించినందుకుగాను రైతులు సర్పంచ్ కి అభినందనలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube