చిత్తారమ్మదేవి జాతర ఏర్పాట్లు పూర్తి

చిత్తారమ్మదేవి జాతర ఏర్పాట్లు పూర్తి

0
TMedia (Telugu News) :

చిత్తారమ్మదేవి జాతర ఏర్పాట్లు పూర్తి

లహరి, జనవరి 19, షాపూర్‌నగర్‌/హైదరాబాద్‌ : నగరంలోని గాజులరామారంలో కొలువైన చిత్తారమ్మదేవి జాతర ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం జాతర నిర్వహించడం ఆనవాయితీ.

ప్రధాన జాతరను 22వ తేదీ ఆదివారం నిర్వహిస్తారు. తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. 1970లో గ్రామంలోని వీరాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించి జాతర ప్రారంభించారు. క్రమంగా ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ సుప్రసిద్ధ దేవాలయంగా అవతరించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. జాతరలో ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించే ఘట్టం,

Also Read : శ్రీశైలం ఆలయానికి రూ. 3.57 కోట్లు ఆదాయం

అదేరోజు సాయంత్రం గాజులరామారం గ్రామం నుంచి అమ్మవారిని గొర్రెపోతులతో కట్టిన రథంలో ఊరేగించే కార్యక్రమం కనులపండువగా నిర్వహిస్తారు. జాతర తర్వాత రోజు రంగం కార్యక్రమంలో పూనకంతో ఊగుతూ మహిళలు భవిష్యవాణి తెలుపుతారు. ముగింపురోజు అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడిబియ్యంతో అన్నదానం నిర్వహిస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube