ఎస్సీ వర్గీకరణ సాధన కోసం చలో ఢిల్లీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 25 వనపర్తి : మాదిగ విద్యార్థుల చైతన్య సమావేశం గురువారం వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎంఎస్ఎఫ్ వనపర్తి ఇంచార్జ్ రాజనగరం రాజేష్ మాదిగ పాల్గొని ప్రసంగించడం జరిగింది. మాదిగ విద్యార్థులారా మన జాతికి రావాల్సిన న్యాయబద్ధమైన వాటాకోసం ఎస్సీలలో ఉన్న 60 ఉప కులాలకు న్యాయం చేకూర్చడం కోసం మంద కృష్ణన్న పిలుపునందుకుని ఢిల్లీకి తరలిరావాలని ఎస్సీ వర్గీకరణ సాధన కోసం డిసెంబర్ 14న జరగబోయే మాదిగ విద్యార్థుల ఛలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయడానికై చైతన్య సమావేశాన్ని నిర్వహించి వర్గీకరణ వర్గీకరణ ఆవశ్యకతను మాదిగల 27ఏళ్ల చిరకాల ఆకాంక్షను వివరిస్తూ

ఈ సమాజానికి దండోరా చేసిన మేలును సాధించిన అనేక సంక్షేమ పథకాల తీరును తెలియపరుస్తూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జాతిని ఏకం చేస్తూ ఐక్యంగా కోట్లాడాలని విద్యార్థులు ముందు వరుసలో నిలబడి జాతి అభ్యున్నతి కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునివ్వడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube