క్రీస్తు జ్యోతి పాఠశాలలో ఘనంగా సెమీ క్రీస్మస్ వేడుకలు

క్రీస్తు జ్యోతి పాఠశాలలో ఘనంగా సెమీ క్రీస్మస్ వేడుకలు

0
TMedia (Telugu News) :

క్రీస్తు జ్యోతి పాఠశాలలో ఘనంగా సెమీ క్రీస్మస్ వేడుకలు

టీ మీడియా, డిసెంబర్ 22, మహానంది : మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని క్రీస్తు జ్యోతి పాఠశాలలో కరస్పాండెంట్ షిధిన్ శామ్యూల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆళ్లగడ్డ మిషనరీ వసంత్ బాబు హాజరయ్యారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, ఆకట్టుకున్నాయి.అలాగే కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. కరస్పాండెంట్ షిధిన్ శామ్యూల్ మాట్లాడుతూ.. క్రీస్తు సూచించిన శాంతి, కరుణ, ప్రేమ మార్గాలను అనుసరించడం ద్వారా ఉన్నతంగా జీవించగలం అన్నారు.ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని అన్నారు.ఆళ్లగడ్డ మిషనరీ వసంత్ బాబు మాట్లాడుతూ ఒకరిపట్ల ఒకరు ప్రేమగా ఉంటే సమాజం శాంతిమయం అవుతుందన్నారు.

Also Read : తగ్గిన కమర్షీయల్​ గ్యాస్ సిలిండర్ ధరలు

ప్రిన్సిపల్ జీనా బాబు మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన శాంతిమార్గాన్ని మానవాళి అనుసరించాలని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube