టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 25
క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది.
కొత్త నిబంధన లోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహేం వచ్చినప్పుడు వసతి గృహంలో గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరికింది, అక్కడే క్రీస్తు జన్మించాడు.దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు. ఆ నాటి నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రీస్తు పుట్టినరోజు నా క్రిస్మస్ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ, క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు. పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం క్రిస్మస్.ఈ క్రమంలో మండలం లోని అల్లిగూడెం గ్రామంలో సీయోను ప్రార్థన మందిరం నందు క్రిస్మస్ వేడుకలను బ్రదర్ పాస్టర్ సీయోన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెమ్మి క్రిస్మస్ లో ప్రతిభ కనబరిచిన పలువు సువార్త గాయకులకు,సంఘస్తులకు,క్రిస్మస్ వేడుకలు కు వచ్చిన అతిథిలతో బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి,కార్యదర్శి బాబూరావు,పాస్టర్స్ దేవదాసు,నెహ్రు,రాజు అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ వెల్ఫెర్ అసోసియేషన్ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరావు, మట్లకుంట చంద్రశేఖర్, కేసిబోయిన వీరాంజనేయులు,ప్రెస్ క్లబ్ అశ్వారావుపేట అసోసియేషన్ సభ్యులు లక్కిరెడ్డి కృష్ణారెడ్డి,తట్టుకొళ దుర్వాసరావు,పల్లెల వెంకటేశ్వరరావు, కేసుపాక నరసింహారావు,నందు తదితరులు పాల్గొన్నారు.