ఘనంగా క్రిస్మస్ వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 23 వనపర్తి : వనపర్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బి.రాములు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్, ఎండి దస్తగిరి, సయ్యద్ గౌస్, నందిమల్ల రమేష్, నాగన్న యాదవ్, బాలయ్య జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Glorious christmas celebrations under the auspices of telugudesam party.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube