రజాకార్లతో పోరాడిన యోధుడు చుక్క

రజాకార్లతో పోరాడిన యోధుడు చుక్క

0
TMedia (Telugu News) :

 

CHUKKA
CHUKKA

విద్యరంగంలో నూతన మార్పులకు సృష్టి-వేలాది విద్యార్థులను ప్రయోజకులను చేసిన విద్యావేత్త

–ఐఐటీ రామయ్యకు శాలువతో సత్కారం
పాధాభివందనం చేసిన మంత్రి ఎర్రబెల్లి

టీ మీడియా, పాలకుర్తి,నవంబర్20:

ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, జనగామ జిల్లా, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం గూడూరుకు చెందిన చుక్కా రామ‌య్య‌ 97 వ పుట్టిన రోజు సందర్భంగా హైద‌రాబాద్ లోని విద్యాన‌గ‌ర్ లో ఆయ‌న నివాసంలో క‌లిసి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపి ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసి,శాలువాతో స‌త్క‌రించి మిఠాయిని అంద‌చేశారు.

ALSO READ:నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి దాయ‌క‌ర్ రావు మాట్లాడుతూ, 1925 ఇదే రోజు పాల‌కుర్తి మండ‌లం గూడురులో జ‌న్మించిన చుక్కా రామ‌య్య‌, నాడు హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు,నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడని తెలిపారు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడని,జ‌న‌గామ‌లో ఉపాధ్యాయుడిగా చేరి, అనేక చోట్ల ప‌ని చేసిన ఆయ‌న‌, నాగార్జున‌సాగ‌ర్ ఆవాస పాఠ‌శాల ప్రిన్సిపాల్ గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశార‌న్నారు. అనంత‌రం ఐఐటి శిక్ష‌ణా కేంద్రాన్ని ప్రారంభించ‌డం కోసం హైద‌రాబాద్ కి వ‌చ్చి, న‌ల్ల‌కుంట‌లో ఆ శిక్షణ కేంద్రాన్ని న‌డుపుతూ వేలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది అప్ప‌టి నుండి చుక్కా రామ‌య్య కాస్తా, ఐఐటి రామ‌య్య‌గా పేరు గాంచార‌న్నారు.విద్యరంగంలో ఎన్నో నూతన మార్పులను తీసుకు వచ్చి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన విద్యావేత్త అని కొనియాడారు.ఉమ్మ‌డి రాష్ట్రంలో 2007లో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యార‌న్నారు. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల కోసం అనేక ర‌చ‌న‌లు చేసిన రామ‌య్య‌, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని, ఆయ‌న‌కు సుదీర్ఘ జీవితం ల‌భించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి కోరుకున్నారు. కొద్దిసేపు ఆయ‌న‌తో ముచ్చ‌టించి దేశం, రాష్ట్రంలోని స‌మ‌కాల‌నీ ప‌రిస్థితుల‌పై పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గురించి ఇద్ద‌రూ కాసేపు మాట్లాడుకున్నట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube