చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై సిఐడి అభ్యర్థన
– తిరస్కరించిన హైకోర్టు
టీ మీడియా, నవంబర్ 3, అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై అదనపు షరతులు విధించాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. సిఐడి పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం.. శుక్రవారం తీర్పు వెల్లడించింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సిఐడి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
Also Read : జల్ జీవన్ మిషన్‌లో స్కామ్.. 25 చోట్ల ఈడీ సోదాలు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube