కార్మికులతో పెట్టుకుంటే పుట్టగతులుండవు

సీటు జిల్లా కార్యదర్శికళ్యాణం

1
TMedia (Telugu News) :

కార్మికులతో పెట్టుకుంటే పుట్టగతులుండవు

సీటు జిల్లా కార్యదర్శికళ్యాణం

టీ మీడియా,నవంబర్ 3, వేంసూర్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని కార్మికులతో పెట్టుకుంటే పుట్ట గతులుండవని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

గురువారం మండల కేంద్రంలోని అమరజీవులు కిన్నెర సునీత, షేక్ మహబూబ్ అలీ నగర్ లో తాళ్లూరి రామారావు,సుశీల ల అధ్యక్షతన జరిగిన సీఐటీయూ మండల 7 వ మహాసభలో పాల్గొన్న కళ్యాణం మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగుల కోసం సీఐటీయూ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు.జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్ధన్,జిల్లా ఉపాధ్యక్షులు చలమాల విఠల్ రావు,హైదరాబాద్ సెంట్రల్ సిటీ నాయకులు పిల్లి పుల్లారావు,రైతు సంఘం నేత అర్వపల్లి జగన్మోహన్ రావు,కోలికిపోగు సర్వేశ్వరరావు లు ప్రసంగించారు.

Also Read : వేగవంతంగా గోళ్ల పాడు ఛానల్ పై అభివృద్ధి పనులు

ముందుగా సీఐటీయూ జెండా ను కళ్యాణం ఆవిష్కరించారు.అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పాలు వేసి నివాళులర్పించారు.అనంతరం మర్లపాడు గ్రామ చౌరస్తా వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్,సాధు శరత్,డంకర శ్రీను,సలీం,గౌసుద్దిన్, ఇబ్రహిం లతో పాటు భవన నిర్మాణ,హమాలీ,ఆటో,డైలీవేజ్, టైలరింగ్,అంగన్వాడీ, ఆశా తదితర సంఘాల కార్మికుల 400 మంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube