భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం – సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్,2, భద్రాచలం

భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసిల్దార్ కి మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ వై.వి.రామారావు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం వన్ వన్ వన్ అవర్ 96 కేంద్ర చట్టం పొన్నాల 79 వలస కార్మికుల చట్టాలను సవరిస్తూ వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేస్తోందని, కరోనా సమయంలో కార్మికులకు ఒక్కపైసా కూడా సహాయం చేసిన ప్రభుత్వాలు దానికి వత్తాసు పలుకుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులకు అన్యాయం చేస్తుందని రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు

పెండింగ్ ఫైళ్లను అనేక పెండింగ్లో ఉన్నాయని కనీసం నియోజకవర్గ స్థాయిలో లేబర్ ఆఫీసర్ కూడా నియమించలేదని అనేక సమస్యలతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాటి సాధన కోసం దేశవ్యాప్తంగా సిడబ్ల్యూ సి.ఐ.టి.యు కల్పించాలని మొదటి రోజు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం,రెండో రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి హక్కులను కాపాడుకోవాలని ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బిల్డింగ్ & ఒథెర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ కాలంలో ఎస్కే జాకీర్, మధుసూదనా చారి,సింహా చారి,శంకరాచారి,రాము, బొద్దుజు శ్రీను,లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

CITU District General Secretary Ramesh urukom looking at construction workers being treated unfairly.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube