హక్కులను మోడీ సర్కారు హరిస్తుంది:సీఐటీయూ!

నిరసన సభ,ప్రదర్శన,మానవహారం!

1
TMedia (Telugu News) :

హక్కులను మోడీ సర్కారు హరిస్తుంది:సీఐటీయూ!

నిరసన సభ,ప్రదర్శన,మానవహారం!

టిమీడియా,29,మార్చి,వేంసూరు : దేశంలో పాలిస్తున్న మోడీ సర్కారు కార్మికుల,ఉద్యోగుల హక్కులను హరిస్తుందని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలమాల విఠల్ రావు అన్నారు.రెండో రోజు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక మండల కార్యాలయం ఎదుట సీఐటీయూ అనుబంధ సంఘాలైన అంగన్వాడీ,ఆశా,మిషన్ భగీరథ,గోపాల మిత్ర,భవన నిర్మాణ,విద్యుత్ ఉద్యోగులు,కార్మికులు టెంట్ వేసుకొని నిరసన దీక్ష చేశారు.దీక్ష వద్ద విఠల్ మాట్లాడుతూ కేంద్రం దేశాన్ని అమ్ముకుంటుందని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ భక్తి కలిగిన కార్మిక సంఘం సీఐటీయూ పైన వుందని తెలిపారు.అనంతరం మండల కార్యాలయం వద్ద నుండి మర్లపాడు గ్రామ రింగ్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేశారు.రింగ్ సెంటర్ లో మండుటెండను సైతం లెక్క చేయకుండా మూడు వందల మంది ఉద్యోగులు,కార్మికులతో మానవహారం నిర్వహించారు.సమ్మెకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఈశ్వరాచారి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో:సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్,మండల కమిటి సభ్యులు ఇ బ్రహీం,రామారావు,సుశీల,జీవమ్మ,అరుణ,పుల్లమ్మ, ఎల్జిబేత్,లలిత,బాలాజీ,మామిడి కృష్ణ,ఖాసీంసాహెబ్,మల్లయ్య,శాంతమని,జగం పుల్లయ్య,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube