పట్టణ సమస్యలకు పరిష్కారం చెప్పాలి

పట్టణ సమస్యలకు పరిష్కారం చెప్పాలి

1
TMedia (Telugu News) :

పట్టణ సమస్యలకు పరిష్కారం చెప్పాలి

టి మీడియా, ఏప్రిల్ 4, భద్రాచలం:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరియు కేంద్ర రాష్ట్ర మంత్రులు విచేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. శ్రీరామనవమికి వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా భద్రాచలం సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ప్రజలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ కోరింది. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన సమస్యలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. కరపత్రం విడుదల చేసిన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడరు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యురాలు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు నాగరాజు, కోరాడ శ్రీనివాస్, డివైఎఫ్ఐ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణను డ్రగ్స్‌కు అడ్డాగా తయారుచేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube