అద్దంలా మెరుస్తున్న రోడ్లు : మంత్రి ఎర్రబెల్లి

టి మీడియా, ఎప్రియల్ 18,సంగారెడ్డి

1
TMedia (Telugu News) :

అద్దంలా మెరుస్తున్న రోడ్లు : మంత్రి ఎర్రబెల్లి

టి మీడియా, ఎప్రియల్ 18,సంగారెడ్డి : నేడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి పల్లెల్లోనూ అంతర్గత రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జిల్లాలోని పోతిరెడ్డిపల్లె నుంచి కోత్లా పూర్ వరకు వేసిన రోడ్డు పనులకు పోతిరెడ్డిపల్లె వద్ద మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకోవాలననారు.ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అద్దంలా మెరుస్తూ కనిపిస్తున్నాయి.

 

also read; బీటెక్‌ విద్యార్ధి అనుమానాస్పద మృతి
రాష్ట్రానికి…పీఎంజీఎస్‌ఐ కింద 1800 కోట్ల విలువైన 2,427 కి. మీ. పొడవైన రోడ్లు మంజూరయ్యాయి. ఇందులో 100 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. మొత్తం143 కోట్ల పనులు ఒక్క సంగారెడ్డి జిల్లాకే అందజేశామన్నారు.
మీకు సమర్థులైన నాయకులు ఉన్నారు. మంత్రి హరీశ్ రావు అద్భుత ప్రగతిని సాధిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.మంత్రి హరీత్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కోరిక మేరకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నాం. అంతే వేగంగా అభివృద్ధిని సాధిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube