స్వయం పరిపాలన దినోత్సవం

స్వయం పరిపాలన దినోత్సవం

1
TMedia (Telugu News) :

స్వయం పరిపాలన దినోత్సవం

టి మీడియా, మార్చి 16 ,పెద్డ శంకరంపేట :
శంకరంపేట మండలం మల్కాపూర్ గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు అని ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న ఆధ్వర్యంలో మొత్తం 25 మంది విద్యార్థులు స్వయం ఉపాద్యాయులు గా పాల్గొన్నారు. మండలం విద్యా అధికారిని గా డి మహేష్ 7 వ తరగతి ప్రధానోపాధ్యాయులు గా అంకిత 8 వ తరగతి పాల్గొన్నారు. అనంతరం బోధనా పద్ధతులను బట్టి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వీటిలో అటెండర్ గా పని చేసిన డి నవీన్ కు ప్రథమ బహుమతి ,అంకిత ప్రధానోపాధ్యాయురాలు 8 వ తరగతి ద్వితీయ బహుమతి అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం శేఖర్ గౌడ్, పండురంగం, శ్రీనివాస్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : చైనాలో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌ లోకి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube